శైవ మహా పీఠం
శ్రీ కాశీవిశాలక్షి సహిత విశ్వేశ్వర స్వామి (నాగోలు,హైదరాబాద్) వారి చతుర్దశ వార్షిక బ్రహ్మోత్సవములు త్రయాహ్నిక దీక్షా విధానము లో శైవాగమోక్త ప్రకారం పూజ్యపీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ డాll అత్తలూరి మృత్యుంజయ శర్మ గారి పర్యవేక్షణలో, శ్రీ ముదిగొండ అమరనాథ శర్మ గారి బృంద వైదీక నిర్వహణలో,12/8/2020 - బుధవారం గోపూజ, విఘ్నేశ్వరుల పూజ తో ప్రారంభమైనవి.
13/8 - గురువారం - విఘ్నేశ్వరుల పూజ మొదలుకొని చండీహోమం, నీరాజనం, మంత్రపుష్పం మొllలగు కార్యక్రమాలు యధావిధిగా జరిగినవి.
అంతకు ముందు పూజ్యపీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ అత్తలూరి మృత్యుంజయ శర్మ గారిచే, శ్రీ ములుగు హనుమంతరావు, శ్రీ ముదిగొండ చంద్రశేఖర్ గార్ల సమక్షంలో శ్రీ ఇవటూరి కృష్ట కైలాష్ గారు రూపొందించిన శ్రీ శైవ మహాపీఠం వెబ్సైట్ ను ప్రారంభించడం కన్నులపండగలా జరిగింది.
చివరి రోజైన 14/8/2020 - శుక్రవారం న విఘ్నేశ్వరుల పూజ మొదలుకొని ప్రకటించిన కార్యక్రమాలన్నీ యధావిది గా జరిగినవి.
జరిగిన సంక్షిప్త సభా కార్యక్రమ మందు పూజ్యపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ డాll అత్తలూరి మృత్యుంజయ శర్మ గారిచే, శ్రీ ముదిగొండ చంద్రశేఖర్ గారు, శ్రీ ముదిగొండ అమరనాథ శర్మ గారు, శ్రీ విఠల్ గారు మొదలగు ప్రభుతుల సమక్షంలో మహామహోపాధ్యాయ డాll కందుకూరి శివానందమూర్తి గారి సిద్ధాంత శికామణి ని విడుదల చేయడం జరిగింది. చివరగా అన్నప్రసాద వితరణ చే కార్యక్రమం పరిపూర్ణమైనది.
మీ అందరి హార్థిక, ఆర్థిక సహాయ సహకారాల్లేకుండా ఈ కార్యక్రమాలన్నీ సుసంపన్నం కాలేదనటం అతిశయోక్తి కాదు.
సకల జనుల సౌభాగ్యం ఆశించే నయనానందభరితమైన ఈ కార్యక్రమాలన్నీ సమస్త ఆస్తిక మహాజనులందరూ ఫేస్ బుక్/వాట్సాప్ లద్వారా వీక్షించి భాగస్వాములు అయి, కాశీవిశ్వేశ్వర స్వామి ఆనుగ్రహ ప్రాప్తి పొందగలరు.
llశుభం భూయాత్ll
*శ్రీ శైవ మహా పీఠం, పాలక సమితి*
No comments:
Post a Comment